Monday, March 23, 2026
Google search engine
HomeSportsT20 World Cup 2026: భారత్ వేదికగా టీ20 వరల్డ్‌కప్...ఈ సారి ప్రైజ్ మనీ ఎంతో...

T20 World Cup 2026: భారత్ వేదికగా టీ20 వరల్డ్‌కప్…ఈ సారి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

-

Google search engine

T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్త వేదికలుగా ప్రారంభం కానుంది. టోర్నీకి ఇంకా కొద్ది రోజులే ఉండటంతో ప్రైజ్‌మనీపై ఉత్కంఠ నెలకొంది. భారత్‌కు ఉన్న భారీ వాణిజ్య విలువ, బ్రాడ్‌కాస్ట్ ఆదాయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈసారి బహుమతులు రికార్డు స్థాయిలో ఉండొచ్చని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

2024లో వెస్టిండీస్–అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విజేతగా నిలిచి 24.5 లక్షల డాలర్లు (రూ.20 కోట్లకు పైగా) గెలుచుకుంది. రన్నరప్ దక్షిణాఫ్రికాకు 12.8 లక్షల డాలర్లు లభించాయి. సూపర్-8 దశకు చేరిన ప్రతి జట్టుకు 3.82 లక్షల డాలర్ల వరకు ప్రైజ్‌మనీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో 2026లో మరింత పెంపు ఖాయమనే అంచనాలు బలంగా ఉన్నాయి. భారత్ హోస్ట్‌గా విజేతగా నిలిచే తొలి జట్టుగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. నాలుగు గ్రూపులు, సూపర్-8, సెమీఫైనల్స్, ఫైనల్ ఫార్మాట్ కొనసాగనుంది. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుండటంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై 10 కేజీల సిలిండర్ మాత్రమే?

న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇళ్లలో వినియోగిస్తున్న 14.2 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ల...
- Advertisement -
Google search engine