Monday, March 23, 2026
Google search engine
HomeNationalT20 World Cup 2026: మరో రెండు రోజుల్లో...ఏ గ్రూప్‌లో ఎవరు ఫేవరెట్? పూర్తి విశ్లేషణ

T20 World Cup 2026: మరో రెండు రోజుల్లో…ఏ గ్రూప్‌లో ఎవరు ఫేవరెట్? పూర్తి విశ్లేషణ

-

Google search engine

T20 World Cup 2026: ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్రికెట్ లవర్స్ కి T20 World Cup 2026 రాణే వచ్చింది. మరో రెండు రోజుల్లో అభిమానుల హృదయాలను ఉర్రూతలూగించేందుకు టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడి పోటీపడనున్నాయి. ఏ గ్రూప్‌లో ఏ జట్టు బలంగా ఉందో ఓసారి చూద్దాం.

“గ్రూప్–ఏ”లో భారత్ స్పష్టమైన ఫేవరెట్‌గా నిలుస్తోంది. పాకిస్థాన్ వాకోవర్ ఇవ్వడంతో టీమిండియాకు పెద్దగా అడ్డంకులు కనిపించడం లేదు. నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా నుంచి గట్టిపోటీ వచ్చే అవకాశం తక్కువ. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో అన్ని విభాగాల్లో భారత్ బలంగా ఉంది. అగ్రస్థానంతో సూపర్ ఎయిట్స్ చేరడం లాంఛనమే.

“గ్రూప్–బి”లో ఆస్ట్రేలియా టాప్ ఫేవరెట్. ఐసీసీ టోర్నీల్లో అనుభవం ఉన్న కంగారూలు ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. అయితే శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ లాంటి జట్లు సంచలనాలు సృష్టించగలవు.

“గ్రూప్–సి”లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ ప్రధాన జట్లు. ఇంగ్లాండ్ ఫామ్‌లో ఉండగా, వెస్టిండీస్ పవర్ హిట్టింగ్‌తో ముప్పుగా మారవచ్చు. స్కాట్లాండ్, నేపాల్ లాంటి జట్లు అండర్‌డాగ్స్‌గా నిలుస్తాయి. ఇటలీకి ఇదే తొలి ప్రపంచకప్.

“గ్రూప్–డి” అత్యంత ప్రమాదకరంగా ఉంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ బరిలో ఉండటంతో ఫలితాలు ఊహించలేనివిగా మారాయి. ఈ గ్రూప్‌లో ప్రతి మ్యాచ్ కీలకమే.

ALSO READ:Elon Musk Space AI Plan | భవిష్యత్తు కోసం ఎలాన్ మస్క్ కొత్త ప్రణాళిక

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine