లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యాశాల రేకుర్తి వారి సౌజన్యంతో ఈ రోజు (29-10-2024 మంగళవారం) ఉదయం 10 గం. ల నుండి మ.2.00 గం. వరకు పెద్దపల్లి అమర్ చంద్ కల్యాణమంటపం లో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిభిరం విజయవంతం అయినట్లు లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి అధ్యక్షులు లయన్ వేల్పుల రమేశ్ తెలిపారు. లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యాశాల రేకుర్తి చైర్మన్ లయన్ కొండా వేణు మూర్తి PDG, మరియు వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ PDG గార్ల సహకారంతో నిర్వహించిన ఈ నేత్ర వైద్య శిబిరంలో 124 మంది కి పైగా హాజరైనారు. కంటిలో శుక్లాలు ఉండి కంటి చూపు మందగించిన 80 మందికి ఆపరేషన్ అవసరం ఉన్నట్లు గుర్తించి వారిలో నుండి మొదటి బ్యాచ్ లో 43 మందిని బస్సులో రేకుర్తి నేత్ర వైద్యాశాలకు తరలించనైనది, త్వరలో మిగిలిన 37 మందిని రెండవ బ్యాచ్ గా రేకుర్తి కంటి హాస్పిటల్ కు పంపించి వారికి ఆపరేషన్ చేయించబడునని తెలిపారు.
ఇట్టి కార్యక్రమానికి సహకరించిన లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యాశాల రేకుర్తి చైర్మన్ లయన్ కొండా వేణు మూర్తి PDG, మరియు వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ PDG గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇట్టి ఉచిత నేత్ర వైద్య శిభిరానికి హాజరైనా 150 మందికి మరియు వారి సహాయకులకు లయన్ వేల్పుల ప్రశాంతి గారి ఆర్ధిక సహాయం తో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయబడినది.
ఈ క్యాంపు లో రేకుర్తి హాస్పిటల్ సిబ్బంది ప్రభాకర్ తో పాటు లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి అధ్యక్షులు లయన్ వేల్పుల రమేశ్, సెక్రటరీ లయన్ బోడకుంట రాంకిషన్, ట్రెజరర్ లయన్ మీసాల సత్యనారాయణ, రిజియన్ చైర్మన్ వేల్పూరి సంపత్ రావు, జోన్ చైర్మన్ R.సుష్మ, క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ కావేటి రాజగోపాల్, లయన్ రేకులపల్లి శశాంక, లయన్ బండ ప్రసాద్ రావు, లయన్ గంట్ల.