పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు డిఎస్పి గంగారెడ్డి ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రిన్స్ హై స్కూల్, విజయ హై స్కూల్ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిఎస్పి గంగారెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖ పనితీరు ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు తెలిపే విధంగా ప్రదర్శన ఉందని 100 డయల్ కాల్ వ్యవస్థ మానిటరింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి జరిగే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఒక్కొక్క విభాగంలో సిబ్బంది చేసే విధులు పోలీస్ స్టేషన్లకు అందించే కమ్యూనికేషన్ సిస్టం పనితీరు గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ గ్రామీణ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్సై లింబాద్రి, గ్రామీణ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆయుధ నిపుణులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం
