శ్రీ తేజ ఆరోగ్యం పై స్పందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు | Sandhya Theatre Incident

Dil Raju gives clarity on financial help extended to Sri Teja after Sandhya Theatre incident Dil Raju gives clarity on financial help extended to Sri Teja after Sandhya Theatre incident

Sandhya Theatre Sri Teja case: హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిపై నిర్మాత దిల్ రాజు(Dill Raju) స్పందించారు. శ్రీ తేజ కుటుంబం పట్ల పూర్తి మద్దతు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే రూ.2 కోట్లు డిపాజిట్ చేయడం జరిగిందని, ఆ మొత్తంపై వచ్చే వడ్డీ శ్రీ తేజ తండ్రికి చేరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆస్పత్రి ఖర్చుల రూపంలో సుమారు రూ.70 లక్షలు చెల్లించామని, రిహాబిలిటేషన్ కేంద్రంలో జరిగే ఖర్చులను అల్లు అర్జున్ భరిస్తున్నారని దిల్ రాజు వెల్లడించారు.

ALSO READ:Techie couple online reception: విమాన రద్దుతో.. వర్చువల్ రిసెప్షన్‌కు హాజరైన నవ దంపతులు

ప్రస్తుతం శ్రీ తేజ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, అల్లు అర్జున్ టీమ్ అవసరమైన స్థాయిలో స్పందించిందని తెలిపారు.

మాట్లాడిన అనంతరం శ్రీ తేజ తండ్రి కూడా ఇప్పటివరకు అల్లు అర్జున్(Allu Arjun) టీమ్ ఎన్నో విధాలుగా తమ కుటుంబాన్ని ఆదుకున్నదని పేర్కొన్నారు.

అయితే ఇంకా కొంత ఆర్థిక సహాయం అవసరమైందని, ఈ విషయాన్ని దిల్ రాజుతో చర్చించినట్టు చెప్పారు. దిల్ రాజు కూడా అన్ని విధాల సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *