కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు దీక్షను నిర్వహించడం జరిగింది. ఈ దీక్షను ప్రముఖ న్యాయవాది క్యాతం సిద్ధిరాములు, టి పి టి ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్ , సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ , సిఐటియు నాయకులు వెంకట్ గౌడ్ , తెలంగాణ రైతు సంఘం నాయకులు మోతి రామ్ నాయక్ , వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొత్త నరసింహులు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ : విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయలేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. సుమారు రాష్ట్రంలో 8300 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ లను ప్రభుత్వం చెల్లించ లేకపోవడం వల్ల విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారని కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడుపుకోలేని పరిస్థితి వచ్చిందని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల జీతాలు ఆపలేని రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యార్థుల స్కాలర్షిప్లను ఎందుకు పెండింగ్లో పెట్టింది అనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే స్కాలర్షిప్ల ను ఇవ్వకపోవడం అని ధ్వజమెత్తారు వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు దీక్షలో కూర్చున్నవారు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదాం అరుణ్ , ఎస్ అజయ్ జిల్లా నాయకులు , మణికంఠ , సమీర్ , రాహుల్ , నితిన్ , సాయి , నవీన్ , శివతేజ , సాయి ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు.