కందుకూరు మండలంలో వృద్ధ దంపతుల హత్య కేసును 48 గంటల్లో చేదించామని,రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల సీపీ క్యాంప్ ఆఫీస్ యందు విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితుడి ద్వారా మిగతా రెండు హత్య కేసులు చేదించామని, మృతుడు ఊషయ్యకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా ట్రేజ్ అవుట్ చేశామని, ఏడాది క్రితం జరిగిన హత్య కేసులో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఆ కేసు చేధించామని, వృద్ధ దంపతులు వద్ద దొరికిన ఫింగర్ ప్రింట్సు ఏడాది క్రితం జరిగిన మహిళ హత్య కేసులో దొరికిన ఫింగర్ ప్రింట్స్ సేమ్ గా ఉన్నాయిఅని, ఏడాది క్రితం జరిగిన మహిళను హత్య చేసి అదే ఊరిలో నిందితుడు ఉన్నాడని, హతురాలిది, నిందితుడిది ఇద్దరిది ఒకే ఊరు అని ఆయన పేర్కొన్నారు.
కందుకూరులో వృద్ధ దంపతుల హత్య కేసు చేదించిన సీపీ సుధీర్ బాబు
