Monday, March 23, 2026
Google search engine
HomeInterNationalIndia Economy Growth: 2028 నాటికి ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌?

India Economy Growth: 2028 నాటికి ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌?

-

Google search engine

India Economy Growth: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోందని, ఇదే వృద్ధి ధోరణి కొనసాగితే 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది.

ప్రస్తుతం జర్మనీని అధిగమించి ఈ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.

SBI అంచనాల ప్రకారం, భారతదేశ ఆదాయ నిర్మాణంలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. 2007లో తక్కువ ఆదాయ దేశం నుంచి తక్కువ మధ్య ఆదాయ దేశంగా మారిన భారత్‌, 2030 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరనుంది.

ALSO READ:Rajasthan Collector | పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే నా లక్ష్యం.. అంతవరకు జీతం తీసుకోను 

2009లో తలసరి ఆదాయం సుమారు 1,000 డాలర్లుగా ఉండగా, 2019 నాటికి ఇది 2,000 డాలర్లకు చేరింది. 2026 నాటికి 3,000 డాలర్లు, 2030 నాటికి దాదాపు 4,000 డాలర్లకు చేరుతుందని SBI అంచనా వేస్తోంది.

ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం ఈ స్థాయి తలసరి ఆదాయం భారత్‌ను ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ కంట్రీ’గా(upper middle income country) గుర్తింపునిస్తుంది.

గత దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా నిలిచిందని SBI నివేదిక పేర్కొంది. స్థిరమైన వృద్ధి రేటుతో భారత్ ప్రపంచ ఆర్థిక పటంలో కీలక శక్తిగా అవతరిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine