Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTSandeep Reddy Vanga | ప్రభాస్‌తో సినిమా చూసిన వంగా.. విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు

Sandeep Reddy Vanga | ప్రభాస్‌తో సినిమా చూసిన వంగా.. విమర్శకులపై ఘాటు వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

Sandeep Reddy Vanga: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. తాజాగా దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ధురంధర్ 2’(Dhurandhar 2) సినిమాను ఆయన హీరో ప్రభాస్‌తో కలిసి వీక్షించారు.

అనంతరం ఈ చిత్రంపై ‘ప్రొపగండా’ అంటూ విమర్శలు చేస్తున్నవారిపై తీవ్రంగా స్పందించారు.

‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో వంగా మాట్లాడుతూ, కొంతమంది రచయితలు, నటులు తమ కెరీర్‌ను ప్రొపగండా ఆధారంగా నిర్మించుకున్నారని అన్నారు. అలాంటి వారు ఇప్పుడు ‘ధురంధర్ 2’పై విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.

ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వారు తమను లిబరల్స్‌గా చెప్పుకోవడం సరైంది కాదని, నిజాన్ని కూడా ప్రొపగండాగా ముద్ర వేయడం నేటి ట్రెండ్‌గా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చిత్రాన్ని ప్రశంసించిన వంగా, దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణవీర్ సింగ్‌ల పనితీరును మెచ్చుకున్నారు. ఈ విమర్శలకు తగిన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో ప్రభాస్‌తో కలిసి సినిమా చూడడం ఈ విషయానికి మరింత ప్రాధాన్యత తెచ్చింది. ప్రస్తుతం వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

FASTag enabled toll plaza in India with vehicles passing through digital toll system without stopping

FASTag | హైవే ప్రయాణం మరింత స్మార్ట్‌గా.. NHAI కీలక నిర్ణయం

FASTag: దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణం మరింత వేగవంతం చేయడానికి కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్...
- Advertisement -
Chat on WhatsApp