Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeNationalSamajwadi Party leader | ప్రతాప్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్...

Samajwadi Party leader | ప్రతాప్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ మృ*తి

-

Chat on WhatsApp

Samajwadi Party leader: ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై అకస్మాత్తుగా హై-మాస్ట్ బిల్‌బోర్డ్ స్తంభం కూలిపోవడంతో కారును నడుపుతున్న సమాజ్‌వాదీ పార్టీ నేత అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటన ప్రతాప్‌గఢ్ జిల్లాలోని బాబుగంజ్ మార్కెట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.

పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద కొత్తగా హై-మాస్ట్ బిల్‌బోర్డ్ ఏర్పాటు పనులు కొనసాగుతున్న సమయంలో, అదే రహదారిపై వెళ్తున్న కారుపై నిర్మాణంలో ఉన్న స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 48 ఏళ్ల ఎస్పీ నేత లాల్‌ బహదూర్ యాదవ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.


ఈ దుర్ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp