Wednesday, April 1, 2026
Chat on WhatsApp
HomeInterNationalRussian Military Plane Crash | కుప్పకూలిన రష్యా సైనిక విమానం...29 మంది దుర్మరణం

Russian Military Plane Crash | కుప్పకూలిన రష్యా సైనిక విమానం…29 మంది దుర్మరణం

-

Chat on WhatsApp

Russian Military Plane Crash: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కలకలం రేపుతోంది. రష్యా సైనిక విభాగానికి చెందిన ఏఎన్-26 రవాణా విమానం క్రిమియా ప్రాంతం మీదుగా ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా రాడార్‌ నుంచి అదృశ్యమైంది.

అనంతరం ఆ విమానం కుప్పకూలినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందినట్లు రష్యా మీడియా వెల్లడించింది.

రష్యా విదేశాంగ అధికారులను ఉటంకిస్తూ స్థానిక మీడియా ఈ విషయాన్ని ప్రసారం చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని శోధన చర్యలు చేపట్టాయి. అయితే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని తెలుస్తోంది.

ఈ ఘటనపై స్పందించిన రష్యా రక్షణశాఖ, విమానం కూలడానికి సాంకేతిక లోపమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నట్లు తెలిపింది. విమానంపై ఎలాంటి బాహ్య దాడి జరిగిందన్న ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని స్పష్టం చేసింది.

ముఖ్యంగా ఈ ఘటనలో ఉగ్రదాడి లేదా శత్రు దాడి కోణం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

అయితే అసలు ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు రష్యా అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

విమాన ప్రమాదం వెనుక సాంకేతిక వైఫల్యమా? లేక మరేదైనా లోపమా? అన్న దానిపై నిపుణుల బృందం పరిశీలన కొనసాగిస్తోంది. ఈ ప్రమాదం రష్యా సైనిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

amelia kerr celebrates after leading new zealand women to a record 347-run chase against south africa in women's odi cricket

New Zealand Women | మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. భారత్ రికార్డు...

New Zealand Women: మహిళా వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు భారత మహిళల జట్టు పేరిట ఉన్న అత్యధిక లక్ష్య ఛేదన రికార్డును కివీస్ చెరిపేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన...
- Advertisement -
Chat on WhatsApp