వరంగల్ అభివృద్ధి కోసం రూ. 4962 కోట్ల కేటాయింపు

As part of the People’s Governance celebrations, the Telangana government has announced significant development plans for Warangal, including infrastructure projects, airports, and cultural centers. As part of the People’s Governance celebrations, the Telangana government has announced significant development plans for Warangal, including infrastructure projects, airports, and cultural centers.

ప్రజా పాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

వరంగల్… కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరం. దశాబ్దకాలంగా నిర్లక్ష్యపు నీడలు. తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం. చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటన నడిపించడానికి నడుం బిగించిన ప్రజా ప్రభుత్వం.

2041 మాస్టర్ ప్లాన్ తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

1. వరంగల్ మహా నగరం అబివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 4962.47 కోట్లు కేటాయించింది.

2. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి ఆదేశాల తో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది.

3. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ : రూ.4,170 కోట్లు

4. మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణ: రూ. 205 కోట్లు

5. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ : 160.92 కోట్లు

6. టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలు ..రూ.33.60 కోట్లు

7. టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్లు.. రూ. 43.15 కోట్లు

8. కాళోజీ కళాక్షేత్రం రూ.85 కోట్లు

9. పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ : రూ. 65 కోట్లు

10. నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం: రూ.8.3 కోట్లు

11. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ రూ. 32.50 కోట్లు

12. ఇన్నర్ రింగ్ రోడ్: రూ.80 కోట్లు

13. భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ న్యూ బిల్డింగ్ : రూ.28 కోట్లు

14. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు : రూ. 49.50

15. వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా : 1.50 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *