విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో సోమవారం ఎన్ఆర్జిఎస్ నిధులు వినియోగంపై సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకొని నిధులు వినియోగించాలని కోరారు . అందులో భాగంగా ఈనెల 14 నుంచి 26వ తేదీ వరకు పల్లె పండగ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన సభలలో నిర్ణయించిన ప్రకారం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.అదేవిధంగా రైతులు వ్యక్తిగత అభివృద్ధికి ఫారం ఫాంట్లు, హార్టికల్చర్ పండ్లతోటల పెంపకం, గోకులాల అభివృద్ధి తదితర అంశాలతో దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కూర్మ నాధ్ పట్నాయక్, ఏవో భాను మూర్తి , ఏపీవో చిన్నప్పయ్య, ఏసి దుర్గాప్రసాద్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
మెంటాడలో ఎన్ఆర్జిఎస్ నిధుల వినియోగంపై సమీక్ష
