Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaరామసహాయం రాధికకు అమెరికాలో కీలక బాధ్యతలు

రామసహాయం రాధికకు అమెరికాలో కీలక బాధ్యతలు

-

Chat on WhatsApp

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామసహాయం రాధికకు అమెరికాలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి, నిర్మల దంపతుల కూతురు రాధిక. ఆమె ప్రస్తుతం అమెరికాలోని కొలంబస్‌లో ఉన్నారు. ఓ సాఫ్టువేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్న రాధిక, ఇటీవల ఒహియో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా నియమించబడ్డారు. ఈ నియామకాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ప్రకటించారు.

రాధిక 2009లో గద్వాల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, పెళ్లి చేసుకుని భర్త రఘురాంరెడ్డితో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ వివిధ కంపెనీల్లో పలు హోదాల్లో పని చేసిన రాధిక, నేషన్‌వైడ్ కంపెనీకి సాఫ్టువేర్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. ఆమె ప్రస్తుతం అమెరికాలోని సాఫ్టువేర్ రంగంలో పలు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రాధికకు అందిన ఈ అవార్డు, ఆమె సమర్థతను, కష్టపడే దృక్పథాన్ని చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుండి ఇలాంటి గౌరవం పొందడం ఎంతో గర్వంగా భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

artemis ii mission spacecraft near moon lunar observation

Artemis II mission | జెరెమీ హాన్సెన్ తో ఆర్టెమిస్ II…చంద్రునిపై భూమితో 40 నిమిషాల...

అంతరిక్ష పరిశోధనల్లో మరో చారిత్రాత్మక మైలురాయి సృష్టించబోతోంది. ఆర్టెమిస్ II మిషన్(Artemis II mission) చంద్రునికి అత్యంత దగ్గరగా చేరి, దశాబ్దాలుగా నిలిచిన అపోలో 13 రికార్డును తాకబోతోంది. ఇంత దూరానికి మానవ...
- Advertisement -
Chat on WhatsApp