గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ‘ఆర్‌సీ 16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, కొత్త షెడ్యూల్ రేపటి నుండి హైదరాబాద్‌లో జరగనుంది. రాత్రి వేళ జరగనున్న ఈ షెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్‌తో పాటు, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ ఆటతో ముడిపడి ఉన్న భావోద్వేగపూరిత కథాంశంతో ఈ చిత్రాన్ని రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘పెద్ది’ అనే టైటిల్ ఈ చిత్రం కోసం పరిశీలనలో ఉందని టాక్ కూడా వస్తోంది.
చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మ్యూజిక్‌ను ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, చరణ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.