Putin on Greenland: గ్రీన్లాండ్ భద్రతకు రష్యా, చైనా నుంచి ముప్పు ఉందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలను కండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. గ్రీన్లాండ్ సమస్యను మీరే పరిక్షరించుకోవాలి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ సమస్యను అమెరికా, డెన్మార్క్‌లు పరస్పరంగా పరిష్కరించుకోవాలని ఘాటుగా స్పందించారు.
రష్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ, గ్రీన్‌లాండ్‌పై జరుగుతున్న ప్రస్తుత పరిణామాల్లో రష్యా ప్రమేయం లేదన్నారు. డెన్మార్క్ గ్రీన్‌లాండ్‌ను తమ దేశంలోని ఒక భాగంగా మాత్రమే చూస్తోందని, దానిపై ఎలాంటి వివక్ష చూపడం లేదని వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై ఇతర దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తాను భావించడం లేదన్నారు.
ఇతరుల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంలో అమెరికాకు సుదీర్ఘ చరిత్ర ఉందని పుతిన్ వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్ కొనుగోలుకు దాదాపు 1 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని, ఆ మొత్తాన్ని భరించే సామర్థ్యం అమెరికాకు ఉందన్నారు.
ఈ సందర్భంగా 1867లో అలస్కాను రష్యా 7.2 మిలియన్ డాలర్లకు అమెరికాకు విక్రయించిన ఘటనను గుర్తుచేశారు.
ఇదిలా ఉండగా, గాజా పునర్నిర్మాణానికి సంబంధించి ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిలో చేరే అంశంపై ఇంకా పరిశీలన కొనసాగుతోందని పుతిన్ తెలిపారు. వ్యూహాత్మక భాగస్వాములతో సంప్రదించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.







