Friday, March 20, 2026
No menu items!
spot_img
HomeFilms Newsపుష్ప-2 రూ.1600 కోట్లు కలెక్షన్లతో మరో రికార్డు

పుష్ప-2 రూ.1600 కోట్లు కలెక్షన్లతో మరో రికార్డు

-

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 కలెక్షన్లు భలేగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ ఈ చిత్రం అప్రతిహతంగా దూసుకెళ్లి బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతోంది. 18వ రోజు ఆదివారం (డిసెంబర్ 22) ఈ సినిమా అంచనాలను మించి రూ.33.25 కోట్లు వసూలు చేసింది.

ఈ కలెక్షన్లతో మూడవ వారం వీకెండ్‌లో రూ.72.3 కోట్లు వసూలు చేసిన పుష్ప-2, అనేక చిత్రాలు ఓపెనింగ్స్ సమయంలో కూడా ఇన్ని కలెక్షన్లు రాబట్టలేకపోయాయని ‘శాక్‌నిల్క్’ పేర్కొంది. ఆదివారం రూ.33.25 కోట్లు, శనివారం రూ.24.75 కోట్లు, శుక్రవారం రూ.14.3 కోట్లు వసూలు చేయగా, ఈ చిత్ర వసూళ్లు దేశవ్యాప్తంగా రూ.1,062.9 కోట్లకు చేరాయి.

2017 నుంచి ఏకంగా 7 సంవత్సరాలు ఉండి చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి-2 రూ.1,040 కోట్ల వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. దీంతో, పుష్ప-2 విడుదలైన దాదాపు మూడు వారాల్లోనే రూ.1,600 కోట్లు దాటింది. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా ₹1,600 కోట్ల వసూళ్లతో పుష్ప-2 ప్రస్తుతం దంగల్ (₹2000 కోట్లు) మరియు బాహుబలి-2 (₹1790 కోట్లు) తర్వాత ఈ స్థానం దక్కించుకుంది. క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు హాలిడే సీజన్ ఉంటున్నందున పుష్ప-2 మరింత దూసుకెళ్లే అవకాశం ఉందని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
- Advertisment -

Must Read

revanth reddy attending gaddar film awards event at hitex hyderabad

హైటెక్స్‌లో గద్దర్ అవార్డ్స్.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.