రెండు గ్రామాల.మూడు ప్రజా సమస్యలపై ఏలేశ్వరంలో మండల్ తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎం ఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయక త్వంలో ధర్నా నిర్వహించారు.
జై అన్నవరం గ్రామం రెవిన్యూ.లో. సర్వే నెంబర్256 లో. ఏ 408 సెంట్లు. సర్వే నెం.246. లో.ఏ395. సెంట్లు.. సర్వేనెం.246-2. లో 100 సెంట్లు. మొత్తం 9 ఎకరాల 9 సెంట్లు. సీలింగ్.
ప్రభుత్వ భూమిని వలస భూస్వామి.మాజేటి జగన్మోహన్రావు ఆక్రమణలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అనుభవిస్తున్క్ర మంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు W,P,NO.2423. ఆఫ్ 2022 ఆర్డర్ 36 మంది .జే అన్నవరం పేదలకు ఇవ్వమని, ఆర్డర్ ఇచ్చియున్నారు కానీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంతో కాలయాపన జరుగుతుంది. జెఅన్నవరంలో మరో వలస భూస్వామి యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి ఆక్రమణలోసర్వే నెంబర్.242.243.244.245.లలో. మొత్తం 2660సెంట్లు గయ్యాలు భూమిని. ఆక్రమించి తన సొంత భూమిలోకలుపుకుని. ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబ ల సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుని. కోర్టు ఆర్డర్ ను చూపిస్తూ భూమినిఅనుభవిస్తూ. అమ్మకానికి సిద్ధం చేసినాడు కావున తక్షణం. రెవిన్యూ వారు రికార్డులలో వాళ్ల పేర్లను రద్దుచేసి స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని…. ఏలేశ్వరంలో మరో భూస్వామి వాగు గుణేశ్వరరావు తండ్రి ఇచ్చిన భూదానం.భూమిని. బినామి పేర్లు ఈ ప్రాంతంలో లేనివారిని పెట్టి భూస్వామే. భూమిని 11 ఎకరాల భూమిసుమారు శిష్టుకు ఇచ్చుకుని అనుభవిస్తా ఉంటే ఈ విషయం తిరుమలి గ్రామం దళితులు భూదాన బోర్డుకి తెలియపరచగా వారు పేర్లను రద్దుచేసి. దళితులకు బీసీలకు ఓసీలకు. పట్టాలు భూదాన బోర్డు వారు ఇవ్వడం జరిగింది. కానీ రెవెన్యూ అధికారులు త్వరితగతిని సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ మూడు సమస్యల మీద సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా నాయకత్వంలో ఏలేశ్వరం మండల్ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
నిర్వహించడం జరిగిందని, ఆ పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు అన్నారు. ప్రజలకు దక్కవలసిన. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ. రెవెన్యూ అధికారులు. నిర్లక్ష్యం చేస్తూ కాలయాపనతో భూస్వాములకు కొమ్ము కాస్తున్నారని గణేశ్వరరావు అన్నారు తక్షణం ఈ భూములను పేదలకు పంచేవరకు పోరాడుతామని అయినా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా
మహిళా కార్యకర్తలు నాయకులు. సోమల కుశల మసిరపు రాజారావు కందుల క్రాంతి కుమార్ దొమ్మేటి లక్ష్మి పారిపల్లి అ రజ్జమ్మ. గుమ్మడి పాదాలమ్మ. గోనాపు వరాలక్ష్మి పందిరి ధర్మరాజు పాక లోవ బాబు ఎద్దు అర్జునుడు పాకాల వెంకట లక్ష్మి. తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహణ
