పోసాని అరెస్ట్, పోలీస్ స్టేషన్ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది

Actor Posani Krishna Murali, taken to Obulavaripalle PS, narrowly escaped an accident at the station.

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించిన సంగతి తెలిసిందే. జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది.

అయితే, పోలీస్ స్టేషన్ వద్ద పోసాని కృష్ణమురళికి తృటిలో ప్రమాదం తప్పింది. వాహనం నుంచి దిగిన తర్వాత స్టేషన్‌లోకి వెళ్లేందుకు అడుగులు వేస్తుండగా, డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని ముందుకు కదిలించాడు. వాహనం పోసానిని తాకడంతో ఆయన కిందపడే పరిస్థితి ఏర్పడింది.

అయితే, పక్కనే ఉన్న పోలీసులు అప్రమత్తంగా స్పందించి వెంటనే ఆయనను పట్టుకున్నారు. దీంతో అతని కాళ్లకు గాయాలు కాకుండా తప్పించగలిగారు. ఈ ఘటనపై పోసాని తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, అక్కడే ఉన్న పోలీసు అధికారులు కూడా డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో పోసాని విచారణ కొనసాగుతోంది. జనసేన నేతలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా ఏర్పడిన ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *