పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా అంబర్‌పేట సిఎఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ పోలీసు అమరవీరుల స్మారక స్థూపానికి , పోలీసు అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, 21 అక్టోబర్, 1959 లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సేనల ఆకస్మిక దాడిలో ప్రాణాలు అర్పించిన 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల స్మారకార్థం దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం సంస్మరణ దినాన్ని పోలీసు పతాక దినంగా పాటిస్తున్నామని సీపీ అన్నారు.
రాచకొండ పోలీసుల సంక్షేమం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు,తదితర భద్రతా చర్యలు చేపట్టామని,రక్తదాన శిబిరాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ సమావేశంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, మల్కాజ్గిరి డిసిపి పద్మజా ఐపీఎస్, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డిసిపి అడ్మిన్ ఇందిరా, ఎస్బి డీసీపీ కరుణాకర్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు,షీ టీం డిసిపి ఉషా విశ్వనాథ్, ట్రాఫిక్ డీసీపీ 1 మనోహర్, ట్రాఫిక్ డీసీపీ 2 శ్రీనివాసులు, ఎస్ఓటి డిసిపి మురళీధర్, అడిషనల్ డీసీపీలు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్.భద్రా రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంబర్‌పేటలో పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES








