Wednesday, March 25, 2026
Chat on WhatsApp
HomeHealth Newsనిఫా వైరస్‌పై భయాలు అక్కర్లేదు: WHO క్లారిటీ

నిఫా వైరస్‌పై భయాలు అక్కర్లేదు: WHO క్లారిటీ

-

Chat on WhatsApp

Nipah Virus: నిఫా వైరస్ విస్తరించడం పై ఆందోళనల మద్య ప్రపంచ ఆరోగ్య సంస్థ  కీలక ప్రకటన చేసింది. భారత్‌లో నిఫా వైరస్ ప్రభావం ప్రస్తుతం “తక్కువగానే ఉందని“, ప్రపంచ దేశాలకు ఎలాంటి పెద్ద ప్రమాదం లేదని WHO స్పష్టం చేసింది. వైరస్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొంది.

ఇటీవల “పశ్చిమబెంగాల్‌లో(west bengal) ఇద్దరికి నిఫా వైరస్ సోకినట్లు” నిర్ధారణ కావడంతో భయాందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చైనా, థాయ్‌లాండ్, నేపాల్, తైవాన్, మలేసియా వంటి దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించాయి.

అయితే WHO స్పందిస్తూ, నిఫా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.

భారత్‌పై ప్రయాణ లేదా వాణిజ్య పరిమితులు విధించాల్సిన అవసరం లేదని WHO స్పష్టం చేసింది. వైరస్ సోకిన ఇద్దరు వ్యక్తులు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని భారత ప్రభుత్వం తెలిపిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. దీంతో ఇతర రాష్ట్రాలకు వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువేనని వెల్లడించింది.

ఇదిలా ఉండగా, భారత్‌లో నిఫా కేసులు నమోదవడంతో చైనా మరింత అప్రమత్తమైంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు తమ దేశంలో ఒక్క నిఫా కేసు కూడా నమోదు కాలేదని చైనా అధికారులు తెలిపారు. మొత్తానికి, పరిస్థితిని అదుపులోనే ఉంచుతున్నామని WHO వెల్లడించడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది.

ALSO READ:Telangana stray dogs | తెలంగాణలో stray dogs విష ఘటన.. NGOs ఆందోళన

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

closed chicken shops in telangana due to protest by poultry traders over low margins

Chicken Shops | చికెన్ ప్రియులకు షాక్.. రాష్ట్రవ్యాప్తంగా షాపులు మూసివేతకు పిలుపు..?

Chicken Shops: తెలంగాణలో చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను ఏప్రిల్ 1 నుంచి బంద్ చేయాలని వ్యాపారులు నిర్ణయించడం సంచలనం రేపుతోంది. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న తక్కువ...
- Advertisement -
Chat on WhatsApp