Jagityal to Mumbai Bus Fire: ముంబైలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి తీవ్ర కలకలం చోటు చేసుకుంది. మలాడ్ ఎక్స్‌ప్రెస్ హైవేపైని కాండివిలీ(Kandivali) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణలోని జగిత్యాల నుంచి ముంబైకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
బస్సు నుంచి పొగలు రావడం గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ALSO READ:Gold Silver Prices Today: టీ20 స్టైల్‌లో దూసుకెళ్లిన పసిడి, వెండి
ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటల నుంచి వెలువడిన పొగ సమీపంలోని మెట్రో స్టేషన్ వరకు వ్యాపించడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
అయితే, అప్పటికే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







