సద్దుల బతుకమ్మ పండుగకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ. సద్దుల బతుకమ్మ పండుగ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో కామారెడ్డి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సద్దుల బతుకమ్మ పండుగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సద్దుల బతుకమ్మ పండగ సంబరాల్లో పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ పండుగలో పాల్గొని పూజలు చేయడం జరిగింది.
జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ పండుగ ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. అంతేకాకుండా కామారెడ్డి పట్టణ మహిళా ప్రజలకు బతకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎంగిలిపుప్వు బతుకమ్మ నుండి మొదలైన బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా రంగు రంగుల పూలతో ప్రతి అడపడుచు ముందుంటున్నారు మహిళలకు ఇష్టమైన పండుగ అంటే బతకమ్మ పండగ అన్నారు.వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.