అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కరుణ అందరిపై చూపాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు చిన్నశంకరంపేట మండలం బాగిర్తి పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సూళ్ల దయానంద్ యాదవ్ కుటుంబ సభ్యులు నిర్మించిన ఆలయంలో శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ దేవిని ప్రతిష్టించగా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, అకాలవర్షాలతో పంటలు నష్టపోతున్నాయని, ఈ పంటలను కాపాడాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ఈ గ్రామ ప్రజలతో పాటు పరిసరమైన ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తో పాటు అతిథులు అందరినీ ఆలయ నిర్మాణ కర్తలు శాలువాదో ఘనంగా సన్మానించారు వివిధ కార్యక్రమాలు ఆలయంలో జరిగి మధ్యాహ్నం రేణుకా దేవి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూళ్ల దయానంద్ యాదవ్, చిన్న శంకర్పేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు కోల్కూరి లక్ష్మారెడ్డి, అయ్యవారి లక్ష్మణ్, సూరారం మాజీ సర్పంచ్ చిలుక నాగరాజు,మాజీ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, బాగా రెడ్డి, రవీందర్ రెడ్డి,చాకలి చంద్రం, వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.