Monday, March 23, 2026
Google search engine
HomeTelanganaMedaram Jatara Buses | మహిళలకు స్పెషల్ బస్సుల్లోనూ ఫ్రీ ట్రావెల్

Medaram Jatara Buses | మహిళలకు స్పెషల్ బస్సుల్లోనూ ఫ్రీ ట్రావెల్

-

Google search engine

Medaram Jatara: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మహా జాతరకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలిపింది.

మేడారం జాతర కోసం టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC) నడపనున్న ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం అమల్లో ఉంటుందని అధికారికంగా ప్రకటించింది.

ALSO READ:Tollywood News: అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం

జాతర కోసం నడిపే స్పెషల్ ఎక్స్‌ప్రెస్, సెమీ డీలక్స్ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ స్పష్టం చేసింది.

ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవడంతో, వాటికి చెక్ పెడుతూ ఈ ప్రకటన చేసింది.

మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర నలుమూలల డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అయితే పురుషులకు మాత్రం నిర్ణయించిన ఛార్జీలు వర్తిస్తాయి.

హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.600, సెమీ డీలక్స్ బస్సులకు రూ.650గా నిర్ణయించారు. హన్మకొండ, వరంగల్ నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.250, సెమీ డీలక్స్‌కు రూ.270 ఛార్జీ ఉంటుంది.

కరీంనగర్ నుంచి రూ.390, ఖమ్మం నుంచి రూ.480, జనగామ నుంచి రూ.400, మహబూబాబాద్ నుంచి రూ.360, కొత్తగూడెం నుంచి రూ.350, గోదావరిఖని నుంచి రూ.480గా టికెట్ ధరలు నిర్ణయించారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine