Friday, March 20, 2026
No menu items!
spot_img
HomeTelanganaMedakమెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మిక పాఠశాల తనిఖీ

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మిక పాఠశాల తనిఖీ

-

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో నాణ్యమైన విద్యాబోధన అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనికి చేశారు పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం బోధన చేశారు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వాళ్ళిచ్చిన సమాధానం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు, విద్యార్థుల హాజరు శాతం సరిగాలేదని హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలని, మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ హాస్టల్, ఎస్టి హాస్టల్ విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు సంబంధిత జిల్లా అధికారులను పంపించడం జరుగుతుందని, విద్యార్థులకు గణితం ఆంగ్లం సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయులను ఆయన ఆదేశించారు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు ఆదేశించారు అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ మెనూ ప్రకారం ఇవ్వాలని ఆయన సూచించారు, పాఠశాల ఆవరణలో టాయిలెట్లను పాఠశాల పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఏవైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని వెంటనే చేయాలని ఆయన ఉపాధ్యాయులకు తెలిపారు, అనంతరం పాఠశాలలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవు దరఖాస్తు పెట్టకుండా ఎవరైనా గైర్హాజర్ అయితే తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్ ఎంపీఓ గిరిజరాణి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisment -

Must Read

revanth reddy attending gaddar film awards event at hitex hyderabad

హైటెక్స్‌లో గద్దర్ అవార్డ్స్.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.