Thursday, March 26, 2026
Chat on WhatsApp
HomeInterNationalPakistan Explosion: ఇస్లామాబాద్‌లో ఘోర ప్రమాదం... బాంబు పేలుడుకి 50 మంది దుర్మరణం

Pakistan Explosion: ఇస్లామాబాద్‌లో ఘోర ప్రమాదం… బాంబు పేలుడుకి 50 మంది దుర్మరణం

-

Chat on WhatsApp

Pakistan Explosion: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం మసీదు వద్ద భారీ బాంబు పేలుడు సంభవించింది. ప్రార్థనల అనంతరం ఈ ఘటనా చోటుచేసుకోవడం వలన 50 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మ*రణం చెందారు, వందల మంది తీవ్రంగా గాయపడ్డారు.

భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించడం జరుగుతోంది. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎవరూ బాధ్యులని ప్రకటించలేదు.

మూడు నెలల క్రితం, నవంబర్ 2025లో కూడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. G-11 ప్రాంతంలోని సెషన్స్ కోర్టు భవనం వెలుపల ఆత్మాహుతి బాంబు దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 30 మందికి పైగా గాయపడ్డారు. పాక్‌లో ఉగ్రవాదుల దాడులు తీవ్రంగా పెరుగుతున్నాయి.

భద్రతా బలగాలు విపత్తును నియంత్రించేందుకు పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పాక్ సైన్యం ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లను వేగవంతం చేసింది. తాజా బ్లాస్టింగ్ కూడా ఉగ్రవాదులకు సంబంధించిందని అధికారులు అనుమానిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp