జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోపేద కుటుంబాలకు ఎల్ఐసి భీమా సంస్థ. ఏదో కుటుంబాలకు రక్షణగా ఎల్ఐసి సంస్థ పనిచేస్తుందని భారతదేశంలో ప్రజలకు నమ్మకం గా పనిచేస్తున్న ఏకైక సంస్థ ఎల్ఐసి అని గద్వాల్ ఎల్ఐసి బ్రాంచ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బంగి రంగారావు అన్నారు. బుధవారం సాయంత్రం ఎర్రబల్లి చౌరస్తాలో ఏజెంట్ మిత్రులు ఆఫీస్ స్టాఫ్ ఇతర బ్రాంచ్ ల నుండి హాజరై కళా జాతర ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జీవిత బీమా రంగా గణనీయమైనదని స్వాతంత్రం అనంతరం జాతీయకరణ చేయబడిన ఎల్ఐసి బీమా సౌకర్యం మారుమూల ప్రాంతాలకు చేరవేసి ఆ సంస్థ ద్వారా కుటుంబాలకు రక్షణగా నిలవ డమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుబడులను ప్రోత్సహిస్తుందన్నారు. హైదరాబాదు సికింద్రాబాద్ డివిజన్ల నుండి ఎల్ఐసి సంస్థ ఉద్యోగులు. కళా జాతర బృందంగా ఏర్పడి హైదరాబాదు నుండి బెంగళూరు వరకు కళా జాతర కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బంగి రంగారావు.. ఉద్యోగస్తులు బషీర్. రాఘవేంద్ర చైతన్య లక్ష్మీకాంత్..కిషోర్ కుమార్.. చంద్రశేఖర్. రంగయ్య. శైలేష్ గద్వాల్ బ్రాంచ్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రవల్లి పేదలకు ఎల్ఐసి భీమా రక్షణ
