Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeSportsKKR VS PBSK | నేడు కోల్‌కతా-పంజాబ్ కీలక పోరు.. హెడ్ టు హెడ్‌లో ఎవరిది...

KKR VS PBSK | నేడు కోల్‌కతా-పంజాబ్ కీలక పోరు.. హెడ్ టు హెడ్‌లో ఎవరిది పైచేయి?

-

Chat on WhatsApp

KKR VS PBSK: ఐపీఎల్ 2026లో నేడు ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో రెండు జట్లు భిన్న పరిస్థితుల్లో బరిలోకి దిగుతున్నాయి.

పంజాబ్ వరుసగా మూడో విజయాన్ని అందుకుని హ్యాట్రిక్‌పై కన్నేసి ఉంటే, కోల్‌కతా మాత్రం వరుస ఓటములకు చెక్ పెట్టి ఈ సీజన్‌లో తొలి గెలుపు కోసం ఆడనుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే పంజాబ్‌కే స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నా, హెడ్ టు హెడ్ గణాంకాలు మాత్రం కోల్‌కతా వైపే ఉన్నాయి.

ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 సార్లు తలపడగా, కోల్‌కతా 21 మ్యాచ్‌లు గెలవగా పంజాబ్ 13 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.

కోల్‌కతాకు బ్యాటింగ్‌లో పెద్దగా ఇబ్బంది కనిపించకపోయినా, బౌలింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అంక్రిష్ రఘువంశీ మంచి ఫామ్‌లో ఉండగా, కెప్టెన్ అజింక్య రహానే, ఫిన్ అలెన్ కూడా మెరుగైన ఆరంభాలు అందిస్తున్నారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో రింకు సింగ్, ఇతర ఫినిషర్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరోవైపు పంజాబ్ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం, కూపర్ కానలీ బ్యాటింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆత్మవిశ్వాసం జట్టుకు బలం. బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ కీలక పాత్ర పోషించనున్నారు.

ఈడెన్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండగా, వాతావరణం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. అందుకే టాస్, పవర్‌ప్లే ప్రదర్శన ఈ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారవచ్చు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp