Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeNationalKarnataka | పరువు హ**త్యలకు చెక్.. కర్ణాటకలో ప్రేమ జంటలకు కఠిన రక్షణ బిల్లు

Karnataka | పరువు హ**త్యలకు చెక్.. కర్ణాటకలో ప్రేమ జంటలకు కఠిన రక్షణ బిల్లు

-

Chat on WhatsApp

Karnataka: కర్ణాటక ప్రభుత్వం ప్రేమ జంటల భద్రతకు కొత్త చట్టం ప్రవేశపెట్టింది. కులం, మతం పేరుతో జరుగుతున్న దాడులు, పరువు హత్యలను అరికట్టుతూ, ‘కర్ణాటక వివాహ ఎంపిక స్వేచ్ఛ, గౌరవం పేరిట జరిగే నేరాల నిరోధక బిల్లు-2026’కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కొత్త బిల్లులో ముఖ్యంగా, తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించే ప్రేమికులు పోలీసులను ఆశ్రయించిన వెంటనే, 6 గంటల్లోపే రక్షణ కల్పించాల్సిన నిబంధన ఉంది. భద్రత కోసం ప్రత్యేక సేఫ్ హౌస్‌లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

పరువు హత్యలు, సామాజిక బహిష్కరణ వంటి నేరాలను ఈ బిల్లు తీవ్ర నేరాలుగా పేర్కొంది. నేరం రుజువైతే కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష నుంచి గరిష్టంగా మరణశిక్ష వరకూ విధించబడుతుంది.

18 ఏళ్ల యువతి, 21 ఏళ్ల యువకుడు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటే, తల్లిదండ్రుల లేదా కుల పెద్దల అనుమతి అవసరం లేదని బిల్లు స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్, 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. 12వ శతాబ్దపు సంస్కర్త బసవన్న సూచించిన ‘ఇవా నమ్మవ’ భావనతో బిల్లు రూపొందించబడింది. కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని ప్రాధాన్యం ఇవ్వడం ఈ చట్ట లక్ష్యం.

దేశంలో పెరుగుతున్న పరువు హత్యల నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp