విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి గారు అన్నారు.జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచే మిని స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-68వ క్రీడా పోటీలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రారంభించారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచే మిని స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-68వ క్రీడా పోటీలను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులచే ఎమ్మెల్యే గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసీ జాతీయస్థాయి పోటీలలో పాల్గోనేలా క్రీడాకారులను తయారు చేయాలని తెలిపారు. పోటీ తత్వం ఉంటేనే క్రీడల్లో మరింతగా రాణించగలుగుతారని అన్నారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చు కోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్ ) పింకేశ్ కుమార్, డీఈవో రాము, జిల్లా యూత్ & స్పోర్ట్స్ అధికారి వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
