భారతదేశం పంజాబ్ నుంచి వీచే గాలులు పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో వాయు కాలుష్యాన్ని తీవ్రమవుతున్నాయని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఆరోపించారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం లో గాలిలో కలుషితపు భారం భారీగా పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్య పరిస్థితులు సరిచేసుకోవాలని సూచించారు.
శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం అధికంగా నమోదవుతుంది. ఢిల్లీ, హర్యాణా, పంజాబ్ తదితర ప్రాంతాల్లో కాలుష్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) స్థాయిని అధిగమిస్తుంది. ఈ ప్రభావం పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లాహోర్ నగరంపైనా పడిందని మరియం అభిప్రాయపడ్డారు. లాహోర్ లో ఏక్యూఐ దారుణంగా 1,067 పాయింట్లకు చేరుకుంది.
ఇది ఆగడం కష్టమని ఆమె పేర్కొన్నారు. గాలి మార్పుల ప్రభావంతో సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కి చేరిన కలుషిత గాలితో సమస్య తీవ్రమవుతుందని చెప్పారు. కాలుష్య సమస్యను తగ్గించేందుకు భారత్‌తో చర్చలు జరిపి, సహకారం కోరతామన్నారు.