indigo crisis: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(DGCA) శీతాకాల షెడ్యూల్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో ప్రస్తుత షెడ్యూల్‌లో “5 శాతం కోత‘ విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు “2,200 విమానాలు” నడుపుతున్న ఇండిగోకు తాజా నిర్ణయంతో రోజుకు “100కిపైగా విమాన సర్వీసులు రద్దు” కావాల్సి వచ్చే అవకాశం ఉంది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో కూడా ఈ కోతలు అమలవనున్నాయి.
సవరించిన కొత్త షెడ్యూల్‌ను బుధవారం సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని DGCA ఆదేశించింది. కోత విధించిన స్లాట్లను ఇతర విమానయాన సంస్థలకు తిరిగి కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇండిగోపై అవసరమైన చర్యలు తప్పవని తెలిపారు.
ALSO READ:Blue Corner Notice: లూథ్రా సోదరులపై ఇంటర్‌పోల్ అలర్ట్
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పైలట్ల విశ్రాంతి నిబంధనలను సడలించడం పట్ల IFALPA ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం విమాన భద్రతపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో తీరుపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
