Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeNationalIndia Malaysia digital payments | భారత్–మలేసియా డిజిటల్ చెల్లింపుల్లో కొత్త అధ్యాయం

India Malaysia digital payments | భారత్–మలేసియా డిజిటల్ చెల్లింపుల్లో కొత్త అధ్యాయం

-

Chat on WhatsApp

India Malaysia digital payments: భారత్‌–మలేసియా మధ్య డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలకమైన మైలురాయి ఏర్పడనుంది. NPCI International Payments Limited (NIPL) మరియు Payments Network Malaysia మధ్య కుదిరిన ఒప్పందంతో, భారత్‌లో విస్తృతంగా వినియోగంలో ఉన్న యూపీఐ (UPI) వ్యవస్థను మలేసియాలోని డ్యూట్‌నౌ (DuitNow) నెట్‌వర్క్‌తో అనుసంధానించనున్నారు.

ముంబైలో గురువారం (ఫిబ్రవరి 12, 2026) ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. దీన్ని దశలవారీగా అమలు చేయనుండగా, పూర్తి గడువును ఇంకా వెల్లడించలేదు.

తొలి దశలో మలేసియాకు వెళ్లే భారతీయులు అక్కడ డ్యూట్‌నౌ క్యూ ఆర్ కోడ్ ఉన్న దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక కేంద్రాల్లో తమ యూపీఐ యాప్‌ల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.

తదుపరి దశలో భారత్‌కు వచ్చే మలేసియా పర్యాటకులు, భారత్‌లోని యూపీఐ క్యూ ఆర్ కోడ్‌లను స్కాన్ చేసి తమ డ్యూట్‌నౌ యాప్‌లతో చెల్లింపులు చేయగలుగుతారు. ఈ అనుసంధానంతో రెండు దేశాల్లో ఉన్న లక్షలాది వ్యాపార కేంద్రాల్లో సరిహద్దులు దాటి డిజిటల్ లావాదేవీలు సాధ్యమవుతాయి.

RBI పర్యవేక్షణలో ఈ భాగస్వామ్యం యూపీఐని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడమే లక్ష్యంగా ఉందని NPCI ఇంటర్నేషనల్ ఎండీ & సీఈఓ రితేశ్ శుక్లా తెలిపారు.

అలాగే, Payments Network Malaysia సీఈఓ ప్రవీణ్ రాజన్ మాట్లాడుతూ, ‘విజిట్ మలేసియా 2026’ కార్యక్రమం నేపథ్యంలో వాణిజ్యం, పర్యాటకానికి ఇది మరింత ఊతమిస్తుందని అన్నారు. ఈ ఒప్పందం భారత్–మలేసియా మధ్య డిజిటల్, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp