Wednesday, March 25, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమ్యాచ్‌కు ముందు రిలాక్స్‌.. వైజాగ్ థియేటర్‌లో టీమిండియా సందడి

మ్యాచ్‌కు ముందు రిలాక్స్‌.. వైజాగ్ థియేటర్‌లో టీమిండియా సందడి

-

Chat on WhatsApp

IND vs NZ 4th T20: న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు విశాఖపట్నంలో రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న వైజాగ్‌కు చేరుకున్న ఇరు జట్లు మ్యాచ్‌కు సిద్ధమవుతుండగా, భారత ఆటగాళ్లు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

బుధవారం (జనవరి 28) ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు ముందు, టీమిండియా క్రికెటర్లు వరుణ్ ఇనాక్స్ థియేటర్‌లో( Vizag Theatre) ‘బార్డర్’ సినిమాను వీక్షించారు.

టీమిండియా కోసం థియేటర్ యాజమాన్యం ప్రత్యేకంగా స్పెషల్ షో ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ షోకు హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి సహా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరయ్యారు.


థియేటర్‌లో సరదాగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన భారత ఆటగాళ్ల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్ల ఈ రిలాక్స్ మోమెంట్స్ క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ALSO READ:Padma Shri Awardee R Madhavan | పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధవన్‌ కథ

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp