రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏ గ్రేడ్ రకానికి 2320 బి గ్రేడ్ రకానికి 2300 రూపాయల క్వింటాలకు చెల్లించడం జరుగుతుందని జిల్లాలో 473 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ అన్నారు.
రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను నాయకులు అభిమానులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 473 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకోవాలని, గతంలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ధర్నాలు చేసిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం దాన్యం పూర్తిగా రాకముందే రైతులు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించడం జరుగుతుందని వారు తెలిపారు.
సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని, రైతులు ఎవరు కూడా అధైర్య పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని ధాన్యం విక్రయించిన 48 గంటల లోపే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్, సివిల్ సప్లై డిఎం హరికృష్ణ, సివిల్ సప్లై డి.ఎస్.ఓ సురేష్, తహసిల్దార్ రజనీకుమారి, çమండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ, వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీనివాస్, ఐకేపి ఏపిఎం రాములు,ఐకెపి సి సి వెంకటరాజ్యం, సిఏలు యాదగిరి, అనిత,గ్రామ సమైక్య అధ్యక్షురాలు భవాని, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.