Saturday, March 21, 2026
Google search engine
HomeNewsMobile App Safety: మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా? అయితే డేటా ప్రమాదంలో ఉన్నట్టే!

Mobile App Safety: మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా? అయితే డేటా ప్రమాదంలో ఉన్నట్టే!

-

Google search engine

Mobile App Safety: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా జీవితం ఊహించలేనంతగా మారింది. రోజువారీ పనుల నుంచి బ్యాంకింగ్, షాపింగ్ వరకు అన్ని అవసరాలకు స్మార్ట్‌ఫోన్లు కీలకంగా మారాయి. ఒకప్పుడు గంటల తరబడి పడే పనులు, ఇప్పుడు కొన్ని యాప్‌ల ద్వారా నిమిషాల్లో పూర్తవుతున్నాయి.

అయితే, ఈ యాప్‌లు ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరమూ కావచ్చు. ముఖ్యంగా వినియోగదారుల “వ్యక్తిగత డేటా, ఫోటోలు, బ్యాంకింగ్ సమాచారం” దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసే యాప్‌లు సురక్షితమైనవేనా అనే విషయాన్ని ముందుగానే నిర్ధారించుకోవడం అవసరం.

అసురక్షిత యాప్‌లు ఎక్కడి నుంచి వస్తాయి?

గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ వంటి అధికారిక స్టోర్స్‌లో యాప్‌లు విడుదలకు ముందు భద్రతా తనిఖీలు జరుగుతాయి. కానీ కొన్ని “థర్డ్-పార్టీ యాప్ స్టోర్స్” ఈ భద్రతా ప్రమాణాలు పాటించకుండా యాప్‌లను అందిస్తున్నాయి. అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తే మాల్వేర్, స్పైవేర్, ఆన్‌లైన్ స్కామ్‌లకు గురయ్యే అవకాశం ఉంది.

యాప్ సురక్షితమా కాదా ఎలా తెలుసుకోవాలి?

1. యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు అది అడిగే అనుమతులను జాగ్రత్తగా చదవాలి.
2. ఆ యాప్ ఫంక్షన్‌కు అవసరమైన అనుమతులేనా కాదా అని పరిశీలించాలి.
3. అవసరం లేని అనుమతులు కోరే యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలి.

ఇలా చేస్తే ఫోన్ సురక్షితం

ఎల్లప్పుడూ “Google Play Store, Apple App Store” వంటి విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌ల నుంచే యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలి. ఇప్పటికే అనుమానాస్పద యాప్‌కు అనుమతులు ఇచ్చి ఉంటే, వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ అనుమతులను రద్దు చేయాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మీ వ్యక్తిగత సమాచారం కూడా సురక్షితంగా ఉంటుంది.

ALSO READ:Swayambhu Movie Update: స్వయంభూ’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine