జనగామ జిల్లా కేంద్రంలోని దుర్గమ్మ గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట దగ్గర స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ సంతోషకరమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
బతుకమ్మ.. ఓ సంబురం.. సంతోషం… తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక…. సగటు తెలంగాణ ఆడపడుచుకు ఇంతకంటే పెద్ద పండగ ఏదీ లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను దేవతగా కొలిచే అరుదైన పండుగ. తీరొక్క పూలను తెచ్చి.. అందంగా పేర్చి.. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో ప్రకృతిని, పూలను పూజించే గొప్ప పండుగని ఆడపడుచులందరు ఉత్సాహంగా ఆటా పాటలతో ఆడుకున్నారు.
జనగామలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా
