Thursday, March 19, 2026
No menu items!
spot_img
HomeNationalGATE Results 2026 | గేట్ రిజల్ట్స్ వచ్చేశాయి...ఇలా స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ?

GATE Results 2026 | గేట్ రిజల్ట్స్ వచ్చేశాయి…ఇలా స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ?

-

GATE Results 2026: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న GATE 2026 ఫలితాలను ఐఐటీ గువాహటి అధికారికంగా విడుదల చేసింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఐఐఎస్‌సీ, ఎన్‌ఐటీ వంటి విద్యాసంస్థల్లో M.Tech, MS, PhD కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుంది.

ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను ప్రకటించారు.

అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్, పాస్‌వర్డ్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.CHECK RESULT HERE:https://gate2026.iitg.ac.in/index.html

మంచి ర్యాంక్ సాధించడం ద్వారా దేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఉన్నత విద్యతో పాటు అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

గేట్ స్కోర్ ఉన్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్ అందిస్తుంది. అదనంగా ONGC, BHEL, NTPC, IOCL, GAIL వంటి ప్రముఖ పీఎస్‌యూలు గేట్ స్కోర్ ఆధారంగా నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి.

టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న అవకాశాల నేపథ్యంలో డేటా సైన్స్, AI, మెషీన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో గేట్ అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి డిమాండ్ ఉంది.

- Advertisement -
- Advertisment -

Must Read

iran saudi conflict

Iran Saudi Conflict |ఇరాన్‌ను హెచ్చరించిన సౌదీ…యుద్ధంలోకి దిగుతామంటూ వార్నింగ్

Iran Saudi Conflict: గత నెల 28న ప్రారంభమైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు తాజాగా కీలక మలుపు తీశాయి. ఇప్పటి వరకు ప్రధానంగా అమెరికా స్థావరాలపై దాడులు జరిపిన ఇరాన్, ఇప్పుడు గల్ఫ్ దేశాల...