Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeKumaram Bheem AsifabadAsifabadకలెక్టరేట్ ముందుగా రైతులు నిరసన - ఎమ్మెల్యే కోవా లక్ష్మి

కలెక్టరేట్ ముందుగా రైతులు నిరసన – ఎమ్మెల్యే కోవా లక్ష్మి

-

Chat on WhatsApp

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు లింగాపూర్ మండలం లొద్దిగూడ, చిన్నదంపూర్ నాయక్ తండా మూడు గ్రామాలకు చెందిన రైతులు తమ భూమి పట్టాలు సంబంధించి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. రైతులు తమ భూమి పట్టాలు ఉన్నా, వాటిని చూపించడంలో విఫలమయ్యారని, కొందరికి పట్టాలు రాలేదని చెప్పుకొచ్చారు.

రైతుల రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా మారిందని, ఎవరూ ఈ సమస్యలను పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు కలెక్టర్ కార్యాలయం వద్ద సమస్యలను వివరించేందుకు వెళ్లి, కలెక్టర్ ను కలుసుకోవాలని కోరినప్పుడు పోలీసులు అడ్డుకోవడం అప్రతిష్టకరమైన చర్యగా భావించారు.

ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. “మేము రైతులను తీసుకొని కలెక్టర్ వద్ద సమస్యను వివరించడానికి వెళ్లినపుడు, పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్?” అని ఆమె ప్రశ్నించారు.

తన వ్యాఖ్యల్లో, “ఈ సంఘటన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసుల ప్రవర్తనకు నిదర్శనం” అని కోవా లక్ష్మి వ్యాఖ్యానించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp