Sunday, April 5, 2026
Chat on WhatsApp
HomeFilms Newsరామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కోసం అభిమానుల వినూత్న ఆరంభం

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం అభిమానుల వినూత్న ఆరంభం

-

Chat on WhatsApp

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. శనివారం నాడు అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని చరణ్ అభిమానాన్ని తెలియజేసేందుకు స్కై డైవ్ చేసి ప్రత్యేక పోస్టర్‌ను ప్రదర్శించాడు.

‘అమెరికాలో టికెట్ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం’ అని రాసిన పోస్టర్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి జంప్ చేస్తూ ప్రదర్శించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ‘గేమ్ ఛేంజర్’ టీమ్ షేర్ చేయడంతో సినిమా పై ఉన్న హైప్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో డల్లాస్ నగరంలో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ నెల 21న డల్లాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ వేదికగా ఈ గ్రాండ్ ఈవెంట్ జరుగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డైరెక్టర్ సుకుమార్ హాజరవుతారు. సినిమా టీజర్, పాటలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను కలిగించాయి.

రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp