పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొమరం భీం కమిటీ ఈ రోజు అమ్మవారిని శ్రీ మహా చండి రూపంలో అలంకరించారు . ఈ రోజు కొమరం భీం ఆధ్వర్యంలో చేసినటువంటి అన్న ప్రసాద కార్యక్రమానికి సహకరించినటువంటి కొ డపత్రి సందీప్ (RMP) గారికి కొమరం భీం యూత్ తర్పున ధన్యవాదాలు తెలిపారు.అమ్మవారు తమ కుటుంబాలను సుఖసంతోషాలతో పసుపు కుంకుమలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ పూజ కారిక్రమానికి మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








