Wednesday, March 18, 2026
No menu items!
spot_img
HomeENTERTAINMENTDhurandhar 2 | తెలుగు అభిమానులకు షాక్...ధురంధర్ 2 ప్రీమియర్స్ నిలిపివేత

Dhurandhar 2 | తెలుగు అభిమానులకు షాక్…ధురంధర్ 2 ప్రీమియర్స్ నిలిపివేత

- Advertisement -
Google search engine

Dhurandhar 2: ‘ధురంధర్ 2’ (ధురంధర్ ది రివెంజ్) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు అభిమానులకు విడుదలకు ముందే నిరాశ ఎదురైంది. మార్చి 19న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాకు ఒక రోజు ముందే ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ప్రదర్శించాలని ప్లాన్ చేసినప్పటికీ, తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ప్రీమియర్ షోలు పలు ప్రాంతాల్లో రద్దు చేయబడ్డాయి.

ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు రిఫండ్లు కూడా జారీ చేసినట్లు సమాచారం. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే గురువారం నుంచి హిందీతో పాటు తెలుగు వెర్షన్ కూడా సాధారణ ప్రదర్శనలు కొనసాగనున్నాయి.

ఇదిలా ఉంటే, దర్శకుడు ఆదిత్య ధర్ అభిమానులతో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. సినిమా పూర్తయ్యే వరకు, ముఖ్యంగా ఎండ్ క్రెడిట్స్ ముగిసే వరకూ థియేటర్‌ను వదిలి వెళ్లవద్దని సూచించారు. చివర్లో ముఖ్యమైన ట్విస్ట్ ఉంటుందని ఆయన సంకేతాలు ఇచ్చారు.

దీంతో ‘పార్ట్ 3’పై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే సీక్వెల్‌పై చర్చలు మొదలుపెట్టారు. దర్శకుడు స్పాయిలర్స్ ఇవ్వవద్దని కోరుతూ, థియేటర్ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించాలని సూచించారు.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

- Advertisement -