జిల్లా ఏర్పాటు తర్వాత పార్వతీపురం ఐటిడిఎ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఇది ఏమాత్రం సహించేది లేదని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ హెచ్చరించారు.
ఈమేరకు చలో ఐటీడీఏ పేరుతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈసందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఐటీడీఏ కు రెగ్యులర్ పీఓ, డీడీ లేకపోతే పాలన ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గిరిజన సంక్షేమం కోసం ఐటీడీఏ కు వచ్చే డబ్బులు గిరిజన సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు .
గిరిజన విద్యార్థుల మరణాలు పాలకులకు పెట్టావా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఏఎన్ఎమ్ లో నియామకం హామీ, మొదటి సంతకం ఏమయ్యిందని గిరిజన సంక్షేమం మంత్రి పి ప్రశ్నించారు.
ఐటీడీఏ స్వతంత్రత ను కాపాడాలని,పాలక వర్గం సమావేశాలు ఏర్పాటు చేసి గిరిజన సమస్యలు చర్చించాలని డిమాండ్ చేశారు.
పీఓ ఆధ్వర్యంలో గిరిజన స్పందన ఏర్పాటు చేయాలని కోరారు.
వైటీసీ, గిరిజన గర్భిణీ స్త్రీలు వసతి గృహం సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు.
ఐటీడీఏ గిరిజన సంక్షేమం ఆశ్రమ పాఠశాలల్లో కుక్,కమాటీ, వాచ్ మెన్ తదితర ఖాళీ పోస్టులు గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.జీవో మూడు పునరుద్ధరణ కోసం ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని, గిరిజన డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ లకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈకార్యక్రమంలో నాయకులు గంగరాజు, ప్రభాకర్, సీతారాం వెల్లూరు, బంగార్రాజు, భాస్కరరావు, నాగార్జున, ముత్యాల, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ స్వతంత్రత కాపాడాలని కోరుతూ ధర్నా
