గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీపై హర్షం

In Khanapur, families of Gulf workers expressed joy over the Telangana government's NRI policy for overseas workers, reflecting on the past government's unfulfilled promises. In Khanapur, families of Gulf workers expressed joy over the Telangana government's NRI policy for overseas workers, reflecting on the past government's unfulfilled promises.

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో గల్ఫ్ కార్మిక కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ హాజరై మాట్లాడారు.. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీని అమలులోకి తేవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన కార్మికులు అక్కడ అనేక కారణాలవల్ల మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, స్థానిక కౌన్సిలర్లు షబ్బీర్ పాష, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *