‘దేవుడిపై నమ్మకం లేదు’ అని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(ss rajamouli) చేసిన వ్యాఖ్యలపై BJP నేత మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేయరు.మేరే ఇలా మాట్లాడితే ఎలా అని స్పందించారు. రాజమౌళి వంటి ప్రముఖులు చేసే వ్యాఖ్యలు ప్రజలపై, ముఖ్యంగా యువతపై, భారీ ప్రభావం చూపుతాయని ఆమె పేర్కొన్నారు.
వ్యక్తిగత నమ్మకాలు పంచుకునే సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.సినిమా విడుదల సమస్యలు వచ్చినప్పుడు ఆంజనేయస్వామిని నమ్ముతారు, కానీ పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో దేవుడిపై నమ్మకం లేదని చెప్పడం ఏ మేరకు సరైనదో రాజమౌళి వివరణ ఇవ్వాలని మాధవీలత ప్రశ్నించారు.

ALSO READ:Sabarimala |శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు రద్దీతో తీవ్ర ఇబ్బందులు
కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచే సినీ ప్రముఖులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. రాజమౌళి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఈ కౌంటర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
