మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కూటమి అఖండ మెజార్టీతో గెలిచిన శుభసదార్బంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణ మరియు మండల శాఖ కావేట్ రాజగోపాల్ మరియు మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా చౌరస్తాలో పటాకలు కాల్చి సీట్లు పంపిణీ చేసి విజయోత్సవ వేడుకలు చేసుకోవడం జరుగింది బిజెపి నాయకులు మాట్లాడుతూ మహారాష్ట్ర లో బిజెపి 141 సీట్లలో పోటీ చేస్తే 130 ఇట్లలో బిజెపి గెలిసి విజయ డంకా మోగించడం జరిగింది కానీ కాంగ్రెస్ రెండు వందల పైచిలుకు అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తే కేవలం 16 స్థానాలతోటి సరిపెట్టుకోవడం జరిగింది.
ప్రస్తుతం చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికలలో కొంచెం అటు ఇటు అయినా కానీ ప్రస్తుతం మరల మోడీ హవ భారత దేశంలో కొనసాగుతున్నాది అనడానికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ ఈ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తూ మేనిఫెస్టో తయారుచేయడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ ఆదివాసీలకు వెనుకబడ్డ తరగతి లకు మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరిగేల మేనిఫెస్టో తయారు చేయడమే, కుల విభజన పై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తే, దానికి దీటుగా మోడీ గారు కుల విభజన చేస్తే ఆదివాసీలు మరియు బీసీలు మధ్యలో ఉంటాయని ఆదివాసీలకు మరియు వెనుకబడ్డ తరగతులకు మరియు ఓబీసీలు కలిసికట్టుగా ఉండాలంటే కుల విభజన చేయకూడదని కాంగ్రెస్ చేసినటువంటి అసత్య ప్రచారను తిప్పికొట్టడం జరిగింది.
అజయ్ మహారాష్ట్రలో ప్రతి మహిళకు 2100 ఇవ్వడం జరుగుతున్నది. ఇలాంటి అనేక సంక్షేమ పథకాలే ఈరోజు మహారాష్ట్ర ప్రజలు మోడీ నాయకత్వానికి పట్టం కట్టలే జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, తంగేడ రాజేశ్వరరావు,పోల్సాని సంపత్ రావు,ఒల్లే తిరుపతి వేల్పుల రమేష్ పింజర్ల రాకేష్ ఉప్పు కిరణ్ సోడా బాబు ముంజ రాజేందర్ పడాల శ్రీనివాస్ గుడ్ల సతీష్ శ్రీనివాసు యాదవ్ పలువురు పాల్గొన్నారు.