మహాబలిపురం రిసార్ట్‌లో బాధిత కుటుంబాలను కలిసిన విజయ్ – ఓదార్చిన టీవీకే చీఫ్
తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కజగం (టీవీకే) ఇటీవల తీవ్రమైన విషాద ఘటనను ఎదుర్కొంది. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో 60 మందికిపైగా గాయపడగా, ఆ వెంటనే విజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించి, వారి పట్ల సానుభూతి…
