Attapur Bike Stunts: హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ఇద్దరు యువకులు పోలీసుల ముందే బైక్ స్టంట్స్ చేస్తూ హల్‌చల్ సృష్టించారు. ప్రధాన రహదారిపై పోలీస్ వాహనం ముందే ప్రమాదకరంగా వీలీ విన్యాసాలు చేయడంతో అక్కడి వారిలో ఆందోళన నెలకొంది.
వెంటనే స్పందించిన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీసీపీ శ్రీనివాస్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇలాంటి ప్రమాదకర చేష్టలు మళ్లీ చేయొద్దని కఠినంగా హెచ్చరించారు.








