Thursday, March 19, 2026
No menu items!
spot_img
HomeAndhra PradeshSummer Holidays | AP ఇంటర్ విద్యార్థులకు శుభవార్త...ఎప్పుడు సెలవులు? పూర్తి వివరాలు ఇవే

Summer Holidays | AP ఇంటర్ విద్యార్థులకు శుభవార్త…ఎప్పుడు సెలవులు? పూర్తి వివరాలు ఇవే

-

Summer Holidays: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తికాగా, ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌తో పాటు వేసవి సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

బోర్డు ప్రకారం, ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి సెకండియర్‌లోకి ప్రవేశించే విద్యార్థులకు ఏప్రిల్ 1, 2026 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.

ఈ సమ్మర్ హాలిడేస్ మే 31 వరకు కొనసాగుతాయి. తిరిగి జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండియర్ తరగతులు ప్రారంభమవుతాయని బోర్డు వెల్లడించింది.

అదేవిధంగా విద్యార్థుల సౌకర్యార్థం దసరా, సంక్రాంతి సెలవుల తేదీలను కూడా ముందుగానే ప్రకటించింది.

దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 20 వరకు ఉండగా, సంక్రాంతి సెలవులు 2027 జనవరి 9 నుంచి 17 వరకు కొనసాగనున్నాయి. ఈ షెడ్యూల్ విద్యార్థులు ముందుగానే తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

- Advertisement -
- Advertisment -

Must Read

gate 2026 results scorecard login screen iit guwahati official website

GATE Results 2026 | గేట్ రిజల్ట్స్ వచ్చేశాయి…ఇలా స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి...

GATE Results 2026: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న GATE 2026 ఫలితాలను ఐఐటీ గువాహటి అధికారికంగా విడుదల చేసింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఐఐఎస్‌సీ, ఎన్‌ఐటీ వంటి విద్యాసంస్థల్లో M.Tech, MS,...